ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 8:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఘనంగా శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు.బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు

ఘనంగా శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు.బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు.

అర్జున్ సమాచారం: అక్టోబర్ 11:ముత్తారం రిపోర్టర్.

ముత్తారం మండలం లక్కారంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని లక్కారం, ముత్తారంతోపాటు పలు గ్రామాల్లో దుర్గామాత ఆలయాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భవానీ దీక్షాపరులు, ఆంజనేయ స్వామి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

నవరాత్రి ఉత్సవాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.